విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై సీఎం జగన్ బుధవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రానున్న విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్యను…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా వుంటారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ఎయిడెడ్ సంస్థల విలీన నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ర్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ప్రక్రియపై వ్యంగ్యంగా ట్వీట్లు పోస్ట్ చేశారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేస్తోంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత హరేకల్ హజబ్బ స్కూలుని కట్టారు. పండ్లు అమ్మిన డబ్బుతో హరేకల హజబ్బ స్కూలును ఎలా నిర్మించగలిగారు అని ట్వీట్…
ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత నెల రోజుల నుండి విద్యార్థులు ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వాలు గానీ ఇటు జిల్లా అధికారులు గానీ స్పందించడం లేదన్నారు. కాకినాడ యుటిఎఫ్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి మాట్లాడారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో…
ఏపీలో ప్రస్తుతం ఎయిడెడ్ విద్యాసంస్థల ఇష్యూ నడుస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం లాక్కొని విద్యార్థులపై భారం వేస్తోందంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తాబత్తుల రత్నాకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థలను అప్పగించాలని ప్రభుత్వం మా పై ఎటువంటి బలవంతం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను నడపలేకపోతేనే ప్రభుత్వానికి అప్పగించమని అడిగారని, నడుపుకోగలుగుతున్న వారి పై…
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… రెండు వేల రెండు వందలకు పైగా ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ గ్రాంట్ తో పని చేస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు అని తెలిపారు. ప్రభుత్వం పలు పథకాలు అందిస్తున్నా…ఎయిడెడ్ స్కూళ్ళల్లో విద్యార్ధుల ఎన్ రోల్ మెంట్ పెరగలేదని గమనించాం. రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో ఏప్రియల్ లో కమిటిని ఏర్పాటు చేశాం. ఈ కమిటి నివేదిక కూడా ఇచ్చింది.…