ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడంలో బిజీగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తమ అభిమానులకు, ప్రియమైన వారికి సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో ద్వారా తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.…