భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ మూడు రోజుల సమావేశంలో, సుస్థిర వ్యవసాయం కోసం జ్ఞానం, అనుభవం, ఆవిష్కరణల ప్రపంచ భాగస్వామ్యానికి శనివారం ప్రాధాన్యత ఇవ్వబడింది. శ్రీఅన్న సాగు, వినియోగాన్ని పెంచడానికి జీ-20 దేశాలు అంగీకరించాయి.
ఎరువుల ధరలను పెంచకూడదని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. జూన్-సెప్టెంబర్ ఖరీఫ్ లేదా వేసవి సీజన్ కోసం రూ.1.08 లక్షల కోట్ల పంట-పోషక సబ్సిడీని ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో యూరియాతో సహా అన్ని కీలక ఎరువుల కోసం తగినంత నిల్వలు, ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు.
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతుంది. మేడేను పురస్కరించుకొని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అనుకోకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
కాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.