Bhatti Vikramarka : జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి…
Sitaphal : తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో పెరుగుతున్న సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (GI) పొందేందుకు శ్రీకొండా లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే అధ్యయనాలు జరుపుతూ గణాంకాలు సేకరిస్తున్నారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఈ ప్రాజెక్టుకు రూ. 12.70 లక్షల సహాయం అందించాలని ముందుకొచ్చింది. మొదటగా బాలానగర్ అడవుల్లో పుట్టిన ఈ సీతాఫలం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించింది.…
Agriculture Market Committee : రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను మంత్రి తుమ్మల శుక్రవారం ప్రకటించారు. కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీలు – షాద్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గాఎ. సులోచన, వైస్ చైర్ పర్సన్ మహ్మద్ అలీఖాన్ నియామకం. హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా కంది తిరుపతిరెడ్డిని, వైస్ చైర్ పర్సన్…
తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వరి దిగుబడిలో కొత్త రికార్డులను సృష్టించబోతుందని, 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడికి అవకాశం ఉన్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడిని చూడబోతున్నామని, అందులో 91 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసే అవకాశముందని చెప్పారు.
Agricultural Development: తాజాగా కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి రూ. 1 లక్ష కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాల విషయానికి వస్తే.. ‘PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PM-RKVY)’ , ‘కృషి ఉన్నతి యోజన (KY)’. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి PM-RKVY, స్వయం సమృద్ధి కోసం ఆహార భద్రత సాధించడానికి కృషి ఉన్నతి యోజనకు…