Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తాలిబన్‌లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఇది నేను పరిష్కరించబోయే 8వ యుద్ధం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది.” శాంతిని మధ్యవర్తిత్వం చేయగల తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ, “నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడిని, శాంతిని నెలకొల్పడంలో నేను నిపుణుడిని. అలా చేయడం గౌరవంగా భావిస్తున్నాను”…
Afghan-Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గురువారం, కాబూల్ నగరంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
Pakistan: భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటించడం పాకిస్తాన్‌కు రుచించడం లేదు. తాలిబాన్ ప్రభుత్వం 2021లో అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తాము చెప్పినట్లు వింటారని భావించింది. చివరకు పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు పాక్, ఆఫ్ఘన్ల మధ్య ఎప్పటి నుంచి సరిహద్దు వివాదం ‘‘డ్యూరాండ్ రేఖ’’తో ముడిపడి ఉంది.
Taslima Nasreen: 2021లో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత, తాలిబాన్ ప్రతినిధి బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై చర్చ నడిచింది. తాలిబాన్లు మహిళల్ని దూరంగా పెడుతున్నారనే వాదన వినిపించింది.
Pakistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన ఎయిర్ స్ట్రైక్స్, పాక్ ఆర్మీపై తాలిబాన్ల దాడులు, భారత్‌లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీ పర్యటన పాకిస్తాన్లో తీవ్ర భయాలను పెంచుతున్నట్లు స్పష్టం తెలుస్తోంది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌ను ‘‘ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరం’’గా, పాకిస్తాన్‌ను వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో 2021లో అధికారం చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ముత్తాఖీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది.
Taliban minister: 2021లో ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. రెండు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించాయి.
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్‌కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ…
Taliban: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఐక్యరాజ్యసమితి అనుమతి పొందిన తర్వాత, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత పర్యటనకు వస్తున్నారు. ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకీకి, భారత పర్యటన కోసం యూఎన్ అనుమతి ఇచ్చింది. 2021లో ఆఫ్ఘాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, ఓ తాలిబాన్ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. భారత, తాలిబాన్ అధికారులు పలుమార్లు యూఏఈ వేదికగా చర్చించారు. ఆఫ్ఘాన్‌కు మానవతా సాయం కింద భారత్…