ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్‌లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూకంపం సంభవించినట్లుగా తెలిపింది.
ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. బుధవారం ఉదయం 4:43 గంటలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) అధికారులు తెలిపారు.
మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోకముందే కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం... ఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూప్రకంపం చోటుచేసుకుంది.
ప్రస్తుతం పాకిస్థాన్ అన్ని వైపుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో జరిగిన రైలు హైజాక్ సంఘటనపై ఒకవైపు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ వంటి స్నేహపూర్వక దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ వైఖరిపై భారత్ కూడా మండిపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌లో భారతదేశ ప్రమేయం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న ఈ నిరాధారమైన అర్థంలేని ప్రచారాన్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.
Taliban: బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో ఆఫ్ఘనినిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్‌తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము.
Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
Donald Trump: ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు వచ్చిన అమెరికా, మరోసారి ఆ దేశానికి వెళ్లాలని యోచిస్తోంది. ‘‘జో బైడెన్ వదులుకున్నాడు, మనం దానిని తిరిగి పొందాలని నేను అనుకుంటున్నారు’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా భావిస్తున్న ఆఫ్ఘాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా సాయుధ దళాల కమాండర్ అండ్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం తర్వాత, ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నన్ను…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వర్షం కారణంగా ఆట రద్దైంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవరల్లో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్‌గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.