అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. 1996 లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా…