గత ఆగస్టులో తాలిబాన్‌ల వశం అయిన ఆప్ఘన్ తీవ్ర సమస్యలతో సతమతమవుతుంది. ప్రపంచ దేశాలు ఆప్ఘన్‌నుకు సాయాన్ని నిలిపి వేయడంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేయాలని ప్రపంచ దేశాలకు తాలిబాన్ సహ వ్యవస్థాపకులు, ప్రసుత్త ప్రధాని ముల్లార్ మహమ్మద్ హస్సాన్ అఖుండ్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టులో అధికారంలోకి వచ్చాక తొలిసారి చేసిన టెలివిజన్ ప్రసంగంలోనే ఆయన ఈ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ ప్రసంగంలో ‘అన్ని దేశాలకు వాటి…