Afghan -Pak War: పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తీవ్ర సరిహద్దు పోరాటం జరుగుతోంది. రెండు వైపుల కూడా పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. చివరక సౌదీ అరేబియా, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య 48 గంటల ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే, నిజంగా పూర్తిస్థాయిలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా.
Pakistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మంగళవారం పాక్ దళాలు, ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 15 మంది సాధారణ పౌరులు చనిపోయినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు చెప్పారు.
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. కుర్రం జిల్లాలో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య మంగళవారం రాత్రి మరోసారి దాడులు ప్రతి దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ తమ 23 మంది సైనికులు మరణించినట్లు, 200 మందికి పైగా తాలిబాన్లను చంపినట్లు చెప్పింది.
Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తాలిబన్‌లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి.
Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్‌లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది.
Pakistan: పాకిస్తాన్ పెంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు. బలూచిస్తాన్‌లో ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆర్మీ కూడా భయపడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, సైన్యం టార్గెట్‌గా తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ చతికిలపడుతోంది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.