అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడం పట్ల.. అఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి ప్రభుత్వ సేనలు చెల్లాచెదురవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘానిస్థాన్.. తాలిబనిస్థాన్ గా మారింది. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ…