అఫ్ఘన్లో అమెరికా బలగాల ఉపసంహరణతో ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై పరిపాలనను చేతిలోకి తీసుకున్నారు. తాలిబన్ల పాలనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్థానికులు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. తాలిబన్లు మాత్రం నిరసనకారులను అణిచివేస్తున్నారు. కాల్పులకు సైతం పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాలనను తమ చేతిలోకి తీసుకున్న తాలిబన్లు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టాలు, హింసకు…
యుద్ధం గెలవాలంటే.. నడిపించే నాయకుడు ఉండాలి.. దూసుకొస్తున్న బుల్లెట్లకు ఎదురెళ్లేంత సాహసం ఉండాలి.. వెన్ను చూపని వీరులను ఎన్నుకోవాలి.. శత్రువు ఎక్కువగా ఉన్నా సరే స్ఫూర్తిని పంచే నాయకుడు అయ్యిండాలి.. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులు లక్షల మంది ఉన్నా వేలమంది బాహుబలి సైన్యం ఎలా గెలిచింది? వారిలో స్ఫూర్తిని నింపి బాహుబలి ‘కాలకేయుడి’ని చంపేశాడు. కానీ అప్ఘనిస్తాన్ లో మాత్రం దీనికి రివర్స్ అయ్యింది. పోరాటం చేయాల్సిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాడి వదిలేసి వేరే దేశం…
ఢిల్లీలోని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ చాలా ప్రసిధ్ది. దేశంలోని నలుమూలలకు ఢిల్లీ నుంచే డ్రై ఫ్రూట్స్ సరఫరా అవుతాయి. ఆప్ఖనిస్తాన్ తో భారత్ దేశం సుమారు ( 400 మిలియన్ అమెరికన్ డాలర్లు) 4 వేలకోట్ల రూపాయల మేరకు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు భారత్ ఓ పెద్ద మార్కెట్. పాత ఢిల్లీలోని, జమా మసీదు సమీపంలో “ఖారీ బావ్లీ” ప్రాంతంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు వెలవెలబోతున్నాయు. ఆప్ఘనిస్తాన్…
అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడం పట్ల.. అఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి ప్రభుత్వ సేనలు చెల్లాచెదురవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘానిస్థాన్.. తాలిబనిస్థాన్ గా మారింది. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ…