Gas leak In Airport: మలేసియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్ లీక్ కావడంతో సుమారు 39 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ దగ్గర గురువారం ఉదయం 11.23 గంటలకు గ్యాస్ లీక్ అయినట్లు పేర్కొన్నారు.