చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం.. చిత్తోర్‌గఢ్ నగరానికి చెందిన సత్పాల్ సింగ్ అరోరా 81 సంవత్సరాల వయస్సులో న్యాయశాస్త్రం చదవడానికి కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈయన చిత్తోర్‌గఢ్ నగరంలోని ప్రతాప్‌గఢ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన అడ్మిషన్ కోసం లా కాలేజీకి చేరుకోవడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా నేర్చుకోవాలనే తపించే ఆయనను కొనియాడారు.…
బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగించారు. నేటితో(జూన్ 19) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా.. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు 22 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ ను మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు తేదీని పొడిగిస్తూ వచ్చిన ఇంటర్ బోర్డ్ తాజాగా ఈనెల 30 వరకు గడువును పొడిగించింది. ఇదే చివరి అవకాశం అని, మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు 30 వ తేదీలోగా అడ్మీషన్లు పొందాలని పేర్కొన్నది. ఇక, ఈ విద్యాసంవత్సంలో ఇంటర్‌లో 70 శాతం సిలబస్ మాత్రమే ఉండబోతున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. Read: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య…