Aditya-L1: సూర్యుడిపై అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతమైంది. 125 రోజలు పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఆదిత్య-L1 ప్రోబ్ విజయవంతంగా తనకు నిర్దేశించిన లాగ్రేజియన్ పాయింట్ 1(L1)లోకి ప్రవేశించింది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్1 హాలో కక్ష్యలోకి శాటిలైట్ విజయవంతంగా ప్రవేశించింది.
Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్ ప్లానెటరీ మిషన్, ఆదిత్య ఎల్1 సోలాల్ మిషన్ విజయవంతంగా నిర్దేశించిన మార్గంలో వెళ్తోంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఆదిత్యఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక చివరి దశకు చేరుకుందని, L1 కక్ష్యలో ప్రవేశపెట్టే విన్యాసాలు జనవరి 7, 2024 నాటికి పూర్తవుతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
Aditya-L1: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆదిత్య ఎల్ 1 అనుకున్నట్లుగానే గమ్యం దిశగా పయణిస్తోంది. తాజాగా భూమి ప్రభావాన్ని తప్పించుకుని ముందుకు సాగుతున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. ‘స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్’ దాటినట్లుగా తెలిపారు.
Aditya L1 Solar Mission: చంద్రయాన్-3 విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిన్న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 శాటిలైన్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం శాటిలైట్ భూమి దిగువ కక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో తిరుగుతోంది. దశల వారీగా కక్ష్యను పెంచుకుంటూ గమ్యస్థానం వైపు వెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆదిత్య ఎల్ 1 తొలి…
PM Modi: ఇస్రో ప్రతిష్టాత్మకం చేపట్టిన ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ విజయవంతం అయింది. ఈ రోజు 11.50 గంటలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపబడింది. భూమి దిగువ కక్ష్యలో ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టింది. ఇక్కడ నుంచి నాలుగు నెలలు ప్రయాణించి భూమి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రేజ్ పాయింట్1(L1)కి చేరనుంది.
Aditya-L1 Solar Mission: చంద్రుడిపై గట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించి ఇటీవల సక్సెస్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో చంద్రుడిపై కాలు మోపింది. ఈ ప్రయోగంతో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై…