Vaishnav Tej: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Vaishnav Tej: మెగాస్టార్ అనే వృక్షాన్ని పట్టుకొని ఎన్నో కొమ్మలు వచ్చాయి. ఆ కొమ్మలు నెమ్మదిగా చెట్టుగా మారుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ వృక్షాన్ని పట్టుకొని వచ్చిన చిన్న కొమ్మ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి చెల్లెలి కొడుకుగా మొదట సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. అన్నకు తగ్గ తమ్ముడిగా.. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.