(జనవరి 10తో ‘అడవిలో అన్న’కు 25 ఏళ్ళు)ఎర్రజెండా సినిమాలకూ జనం జేజేలు పలుకుతున్న రోజుల్లో కొందరు స్టార్ హీరోస్ సైతం అటువైపు అడుగులు వేశారు. అలా మోహన్ బాబు నేను సైతం అంటూ విప్లవభావాలతో పాటు, ఆదర్శాలనూ పెనవేసి తెరకెక్కించిన చిత్రం ‘అడవిలో అన్న’. బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసి, నిర్మించిన చిత్రం ‘అడవిలో అన్న’. 1997 జనవరి 10న ఈ సినిమా విడుదలయింది. రెడ్ మార్క్ మూవీస్ కు అప్పట్లో తన బాణీలతో…