(జూలై 20న శ్రీలక్ష్మి పుట్టినరోజు) శ్రీలక్ష్మి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలు ఇట్టే విచ్చుకుంటాయి. ఆమె నవ్వుల పువ్వులు ఏరుకోవడంలోనే తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుడుతూఉంటాయి. ‘పుణ్యభూమి కళ్ళుతెరు’ చిత్రంలో నాయికగా పరిచయమైన శ్రీలక్ష్మి, తరువాత హాస్యనటిగానే పకపకలు పండించారు. జంధ్యాల చిత్రాల ద్వారా శ్రీలక్ష్మికి విశేషమైన గుర్తింపు లభించింది. ‘ఆనందభైరవి’లో ఆనందం వస్తే ఈల వేసే పాత్రలో శ్రీలక్ష్మి పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు? ఇక “శ్రీవారికి ప్రేమలేఖ, రెండు రెళ్ళు ఆరు,…