నవ్వుల రారాజు, ప్రముఖ సినీ హాస్యనటుడు రాజబాబు 87వ జయంతి వేడుక రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహం దగ్గర ఘనంగా జరిగింది. రాజబాబు సోదరుడు బాబి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.