చెన్నైలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ సినీ నటుడు ప్రభు నివాసం సహా అమెరికా రాయబారి కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో త్వరలోనే బాంబు పేలుతుందని, ఆ తరువాత నటుడు ప్రభు ఇంట్లో కూడా బాంబు పేలుతుందని…