ఉరిశిక్ష పడిన వ్యక్తిని 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన అనంతరం సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తన భార్య, తల్లి, రెండేళ్ల బాలికను హత్య చేశాడని ఆరోపించారు.
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే నిర్దోషి అని తేలింది. సందీప్ లామిచానేపై దాఖలైన అత్యాచారం కేసులో పటాన్ హైకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ తరుఫున ఆడనున్నాడు. పటాన్ హైకోర్టు అధికార ప్రతినిధి తీర్థరాజ్ భట్టారాయ్ ప్రకారం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ బెంచ్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.