2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రజ్ఞా ఠాకూర్‌ను నిర్దోషిగా న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో అనుమానం సరిపోదని కోర్టు తెలిపింది. దీంతో ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, మాజీ సైనిక అధికారి ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని.. పేలుడులో వాడిన బైక్ ప్రజ్ఞాకు చెందినదిగా నిరూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్‌డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య
పవిత్ర రంజాన్ మాసం సమయంలో ముంబై నుంచి 200 కి.మీ దూరంలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మాలేగావ్‌లోని భిక్కు చౌక్ సమీపంలో సెప్టెంబర్ 29, 2008 రాత్రి పేలుడు సంభవించింది. శక్తివంతమైన బాంబు పేలి ఆరుగురు మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఆనాటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య, సమీర్ కులకర్ణి లాంటి మరో ఐదుగురు నిందితులు విచారణను ఎదుర్కొంటున్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: US: కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్