పొగమంచు కారణంగా తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి.
శబరిమల యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడి ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న జనాలపైకి ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు.
Stunt Master: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తమిళ సినిమా ‘విడుదలై’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై శివారులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్‌లో భాగంగా తాడుకు వేలాడుతున్న స్టంట్ మాస్టర్ సురేష్ తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో చోటు చేసుకుంది. Read Also: Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో…
Bihar Road Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి పక్కన పూజలు చేస్తున్న భక్తులపైకి ట్రక్కు అదుపుతప్పి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా 12మంది మృతిచెందారు.
Tanker Accident: మహారాష్ట్రలోని పుణెలో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఆదివారం పుణెలోని నవాలే వంతెన వద్ద అతివేగంతో లారీ దూసుకురావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలను ట్యాంకర్ ఢీకొనడంతో కనీసం 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 48 వాహనాలు కుప్పకూలిపోయాయని పూణే అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. పుణె ఫైర్ బ్రిగేడ్, పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన దవాఖానకు…