Woman Hit By Car: వీధికుక్కల ఆకలి తీరుస్తున్న యువతిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Hit By Car: సెలవు రోజు అంటే చాలు… స్నేహితులతో ఏ సినిమాకు వెళ్లాలి? ఏ ప్లేస్‌కు టూర్ వేయాలి?… ఇలా రకరకాల ప్లాన్స్‌తో ఉంటారు చాలామంది. కానీ, ఆమె మాత్రం ఆదివారం వచ్చిందంటే… వీధికుక్కలకు ఆహారాన్ని తీసుకెళ్తుంది. ఇలానే వీధి శునకాలపై ప్రేమతో తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంది ఛండీగఢ్‌లోని తేజస్విత.
చండీగఢ్ లో తేజస్విత (25) అనే యువతి తన ఇంటికి సమీపంలో రహదారి పక్కన కుక్కలకు ఆహారం వేస్తోంది. అదే సమయంలో ఓ కారు పక్క రహదారి నుంచి యూ టర్న్ తీసుకుని వేగంగా కుక్కతో పాటు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తేజస్విత కింద పడిపోగా, శునకం అక్కడి నుంచి పరారైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. తేజశ్విత తలకు గాయం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వారితో మాట్లాడిందని, బాగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తేజశ్విత రోజూ తన తల్లితో కలిసి వీధికుక్కలకు ఆహారం ఇచ్చేందుకు వెళ్లేదని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి తేజశ్విత, ఆమె తల్లి మంజీదర్ కౌర్‌లు ఫుట్‌పాత్ పక్కనే వీధికుక్కలకు ఆహారం ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
యువతిపైకి కారు దూసుకెళ్లడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. రక్తపు మడుగులో పడి ఉన్న తేజశ్వితను చూసి తల్లి నివ్వెరపోయింది. సహాయం చేయడానికి ఎవరూ ఆగలేదని ఆమె చెప్పింది. ఆమె ఇంటికి, పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తేజశ్విత తండ్రి ఓజస్వి కౌశల్ తెలిపారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు రోజూ తన తల్లితో కలిసి వెళ్లేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి వాహనం, డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Road Accident: పల్టీలు కొట్టిన వాహనం.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం
వరుస భయానక ప్రమాదాలు ర్యాష్ డ్రైవింగ్‌ను వెలుగులోకి తెచ్చాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది ఢిల్లీ కార్ హర్రర్ కేసు, ఇందులో 20 ఏళ్ల మహిళ కారు కింద కాలు ఇరుక్కుపోయి, వాహనం ఆమెను రోడ్లపైకి లాగడంతో మరణించింది. మరో విషాద ఘటనలో గురుగ్రామ్-ఫరీదాబాద్ రహదారిపై వేగంగా వస్తున్న పోలీసు వ్యాన్ కారును ఢీకొట్టింది. ఆరేళ్ల బాలిక మృతి చెందగా, ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. దిగ్భ్రాంతికరంగా, పోలీసు సిబ్బంది చిన్నారిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించలేదు. బదులుగా, అక్కడి నుండి పారిపోయారు.
#Chandigarh: 25-year-old girl run over by speeding car while she was feeding stray #dog pic.twitter.com/6Yk52AgNOc
— Journalist Anurag K Sason (@AnuragSason) January 16, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!