హైదరాబాద్ నగరంలో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పరిధిలో హిట్ అండ్ రన్ కేసు ఇది రెండోది. శనివారం ఒక ఘటన జరగగా.. మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.
అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్‌లో మాట్లాడారు.
Lift Accident : హైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బరాదరిలోని అపార్ట్‌మెంట్ భవనం వద్ద లిఫ్ట్ కూలిపోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. లిఫ్ట్ అకస్మాత్తుగా చెడిపోవడంతో లోపల ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు కుప్పకూలిన ఘటన జరిగింది. ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ కాగా, మరో ఐదుగురికి వివిధ గాయాలయ్యాయి. అత్యవసర సేవలు చందూలాల్ బరాదరిలోని అపార్ట్‌మెంట్‌లకు త్వరగా చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై…