ACB Raid: వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏఓ) భూపతి జయశంకర్, ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కోసం జయశంకర్ లంచం డిమాండ్ చేశారు. మొదటగా రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా, చివరికి రూ. 75 వేలకు అంగీకరించారు. లైసెన్స్ అనుమతులు ఇచ్చిన తర్వాత, మొదటి విడతగా రూ. 50…
హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. నరసింహారావు అనే ఈ అధికారి, ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.