ACB Raid: వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏఓ) భూపతి జయశంకర్, ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కోసం జయశంకర్ లంచం డిమాండ్ చేశారు. మొదటగా రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా, చివరికి రూ. 75 వేలకు అంగీకరించారు. లైసెన్స్ అనుమతులు ఇచ్చిన తర్వాత, మొదటి విడతగా రూ. 50 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు.
Tobacco Packet: బెల్లంలో నిషేధిత పొగాకు ప్యాకెట్.. దుర్గదేవి భక్తుల ఆగ్రహం
వికారాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా ఏసీబీ అధికారులు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో జయశంకర్‌ను అరెస్టు చేసి తదుపరి చర్యల కోసం తరలించారు. ప్రభుత్వ శాఖలలో లంచం తీసుకోవడం నేరం అని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
Ladakh Violence: లడఖ్ హింసపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!