ACB Raids: విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అంబేద్కర్‌తో పాటు ఆయన సన్నిహితులు, బినామీల నివాసాల్లో 15 బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. Ayyanna Patrudu: అసెంబ్లీకి రాకపోతే జీతం…
హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ACB : తెలంగాణలో హల్చల్ రేపిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనపై లుక్‌ఔట్ నోటీస్ (LOC) జారీ చేయగా, హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. ఇద్దరి పాస్‌పోర్టులను అధికారులు ఇప్పటికే…
మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ అయ్యారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.