అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. కారు మహిళా పారిశుధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈరోజు ఉదయం.. గురుగ్రామ్‌లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు.
Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదని ‘పరారీ’ ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణలో హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి.
మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై కేరళలోని ఎర్నాకులంలో అత్యాచారం కేసు నమోదైంది. సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానంటూ ఆశ చూపి, అత్యాచారం చేశాడని ఓ నటి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ బాబుపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (లైంగిక వేధింపు), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం సిటీ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు నమోదైంది. తనపై కేసు నమోదైందనే విషయం…
ఈరోజుల్లో పెళ్లి పేరుతో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా ముగ్గుర్ని పెళ్ళాడాడు ఆ ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లాలో ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్య పెళ్ళికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యలు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడు. ఈ నిత్య పెళ్ళికోడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా…