Haldwani violence: ఉత్తరాఖండ్ హల్ద్వానీ ప్రాంతంలో ఫిబ్రవరి 8న తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కోర్టు ఆదేశాల మేరకు కూల్చవేస్తున్న తరుణంలో హింస చోటు చేసుకుంది. పోలీసులు, ఇతర అధికారులే టార్గెట్‌గా స్థానికులు విరుచుకుపడ్డారు. పోలీసులను నిర్బంధించి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు వారిపై దాడి చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.