ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ గా డివిలియర్స్ రాబోతున్నాడా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌తో ఇక క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన ఏబీ.. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టుతోనే ఉండనున్నాడా.. ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అవుననే అంటున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. ఇక లీగ్స్ కూడా ఆడనని ప్రకటించాడు. ఈ మధ్యే దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-14 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాడు. ఆ తర్వాత…