ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజేష్ రిషి, నరేష్ యాదవ్, రోహిత్ కుమార్ మెహ్రాలియా శుక్రవారం రాజీనామా చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదలైన తర్వాత హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా సమర్పించనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ట్రై చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో పొలిటికల్ హీట్ మొదలైంది.. ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో పడనుందా..? అనే చర్చ మొదలైంది.. సీఎం కేజ్రీవాల్‌తో నిర్వహించిన కీలక భేటీకి చాలా మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై… అనుమానాలు రేగుతున్నాయి. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచారు సీఎం కేజ్రీవాల్. ఎమ్మెల్యేలందరినీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం…