దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా యుద్ధం సాగిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం బాణసంచాపై "శాశ్వత నిషేధం" విధించారు.
Delhi Air Pollution: చలికాలంలో రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. అప్పటికి పంట పూర్తి కావడం.. దీంతో పొలాల్లోని మొలకలను రైతులు తగలబెట్టడం వల్ల పొగ విపరీతంగా గాల్లోకి చేరి కాలుష్యం ఏర్పడుతుంది.
Current Subsidy : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు పెద్ద షాక్ తగలనుంది. ఢిల్లీలో నేటితో విద్యుత్ సబ్సిడీ ముగియనుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. నేటితో రాష్ట్రంలోని 46 లక్షల కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ ముగుస్తుంది.
బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియర్ కిల్లర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారును కూడా కూల్చేందుకు బీజేపీ యత్నించిందని, బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవాలని యత్నించిందని.. కానీ ఆప్ నేతలు వారి బుట్టలో పడలేదని ఆయన అన్నారు.
AAP government Withdrawal of new liquor policy: ఢిల్లీలో ఆప్ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త మద్యంపాలసీని ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. మద్యం షాపులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడంతో ఢిల్లీ ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.
పంజాబ్‌లో ఇటీవలే ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు కొత్త కేబినెట్‌లో ఆప్ నేత విజయ్ సింఘ్లాకు ఆరోగ్య శాఖను సీఎం భగవంత్ మాన్‌సింగ్ కట్టబెట్టారు. అయితే రెండు నెలలు తిరగకముందే మంత్రి పదవిని విజయ్ సింఘ్లా దుర్వినియోగం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ కాంట్రాక్టుల కోసం మంత్రి విజయ్ సింఘ్లా ఒక శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్…
ఢిల్లీలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టింది.. వచ్చే ఏడాది పంజాబాద్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే సిద్ధం అవుతోంది.. తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనేది హామీ కూడా ఇస్తున్నారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్… పంజాబ్ ఎన్నికల్లో తాము గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న విద్యుత్…