కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ మహిళా హాస్టల్ లో చాప కింద నీరులా ర్యాగింగ్ భూతం విస్తరిస్తోంది. జూనియర్ విద్యార్థినిలపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏకంగా 81 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు.