తెలంగాణలో కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేస్తున్నారు. గత రెండు నెలల్లో నమోదైన కేసుల వివరాలని హైకోర్టుకు సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ పై 150 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని…