ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల దిగువన 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ సంస్థ తెలిపింది. ఉత్తర తీర ప్రాంతానికి 1 మీటర్ వరకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ NHK ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా, జపాన్ ఉత్తరాన ఉన్న ఇవాటే ప్రిఫెక్చర్‌కు సునామీ…
Earthquake: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ భాగంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన అంచనాలు తెలియరాలేదు. దక్షిణ ద్వీపమైన మిండానాలోలోని సారంగని ప్రావిన్స్‌లో భూకంప వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూమి అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.