(ఆగస్టు 27తో కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’కు 50 ఏళ్ళు పూర్తి) ఏ రంగంలోనైనా రాణించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలి. అలా చాటుకున్నవారే ఎక్కడైనా హీరోలు. నటశేఖర కృష్ణ సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి అప్పటికే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో నటించేసిన మేటి నటులు రాజ్యమేలుతున్నార. వారి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించిన కృష్ణ ఎలాగైనా తాను వారి స్థాయికి చేరుకోవాలని కలలు కనేవారు. అందుకు ఆయన తమ్ముళ్ళు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు సైతం దన్నుగా నిలిచారు.…