(ఏప్రిల్ 19న ‘అంతా మన మంచికే’కు 50 ఏళ్ళు) మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ 1953లోనే ‘చండీరాణి’తో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ తరువాత దాదాపు 19 ఏళ్ళ వరకు ఆమె దర్శకత్వం ఊసు ఎత్తలేదు. 1972లో స్వీయ దర్శకత్వంలో తమ భరణీ పిక్చర్స్ పతాకంపై ‘అంతా మన మంచికే’ అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు భానుమతి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం భానుమతి నిర్వహించారు. ఈ సినిమాలో కృష్ణ…