జూబ్లిహిల్స్ ఆమ్నేసియా పబ్ అత్యాచార కేసులో ఐదుగురు నిందితులను గుర్తించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఈ కేసులో నిందితులుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. భరోసా సెంటర్ కు పంపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బాధిత అమ్మాయి పూర్తి వివరాలను చెప్పిందని ఆయన వెల్లడించారు. నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని డీసీపీ వెల్లడించారు. అమ్మాయి…