Jai Shankar: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. వాషింగ్టన్ డీసీలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచంలోని పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. అయితే, భారతదేశ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొననున్నారు. మినిస్టరీ అఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకటన ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ – వాన్స్ కమిటీ ఆహ్వానం…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలంటూ తమిళనాడు వాసులు పూజలు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ బ్యానర్లు కట్టారు. తీరా.. ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ నిరాశలోకి వెళ్లిపోయారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ పరాజయం పాలయ్యారు. ట్రంప్‌పై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. తొలుత సర్వేలన్నీ కమలా హారిస్ వైపే ఉన్నాయి. మళ్లీ డెమోక్రటిక్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కోడైకూశాయి. కానీ ఫలితాలు వచ్చేటప్పటికీ అంచనాలన్నీ తారుమారయ్యాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 270 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. ప్రస్తుతం ఇప్పటి వరకూ ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.
Donald Trump Win US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే సంవత్సరం బంగారుమయం అవుతుందని, ఈ విజయం అపురూపం అని ఆయన అన్నారు. ముఖ్యంగా మాకు స్వింగ్ రాష్ట్రాల పూర్తి మద్దతు లభించిందని ఆయన అన్నారు. Read Also: Arshdeep Singh Record:…