నటశేఖర కృష్ణ, అందాలరాశి శ్రీదేవి జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని అలరించాయి. శ్రీదేవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన క్రెడిట్ కృష్ణకే దక్కుతుంది. ‘బుర్రిపాలెం బుల్లోడు’తో ఆరంభమైన కృష్ణ, శ్రీదేవి జోడీ తరువాత దాదాపు పాతిక చిత్రాలలో కనువిందు చేసింది. వారిద్దరూ నటించిన చిత్రాలలో ‘కిరాయి కోటిగాడు’ కూడా భలేగా సందడి చేసింది. ఈ చిత్రానికి ముందు కృష్ణ-శ్రీదేవి జంటగా “బుర్రిపాలెం బుల్లోడు, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్, అదృష్టవంతుడు, చుట్టాలున్నారు జాగ్రత్త, బంగారు బావ,…