ప్రధాని మోడీ మంగళవారం త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఏం చేయాలన్నదానిపై మేథోమథనం చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ప్రధాని మోడీ మార్గదర్శకం చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం నాడు పోలీసులు అడవిలో గుర్తించారు. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవిత కుమార్తె జోషిక (4) శనివారం సాయంత్రం ఇంటి నుంచి ఆడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం…