ఈ నెల 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముందు రోజైన 30వ తేదీన సిఫారసు లెటర్లు స్వీకరించబడవని వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదల చేసింది.