ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.