KTR Challenge: రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా రైతు రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.