KTR Challenge: రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా రైతు రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కొండారెడ్డి పల్లి, పాలేరు నుంచి ఎక్కడికైనా వెళ్లాలని సవాల్ విసిరారు. ఇవాళ అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగింది. దీనిపై కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రైతులను అడగాలని అన్నారు. 100 శాతం రుణమాఫీ చేశామని నిరూపించాలని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని.. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీకి రూ.49 వేల 500 కోట్లు అని చెప్పారు.
Read also: Harish Rao Vs Komatireddy: కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..
మొన్న జరిగిన పాలమూరు విజయోత్సవ సభలో సీఎం రూ. 19 వేల కోట్లు. ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం.. ఈ రాష్ట్రంలోని ఏ పల్లెకైనా వెళ్దాం.. కొండారెడ్డిపల్లె, సిరిసిల్ల, పాలేరు.. ఎక్కడి వెళ్దాం మంటే అక్కడికి వెళ్దాం. ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే వెంటనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇలాంటి బుకాయింపులు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎగ్గొట్టేందుకు యత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల భరోసా బడ్జెట్‌లో 15 వేల కోట్లు కేటాయించారు. రూ. 70 లక్షల మంది రైతులకు 23 వేల కోట్లు కావాలి. రైతుబంధు కోత సిద్ధమైన తర్వాతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం వేసి కాలయాపన చేస్తున్నారు. వర్షాకాలంలో రైతుబంధును నివారించినట్లే ఇప్పుడు కూడా రైతుబంధును తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనిఫెస్టోలో కోతలను ఎందుకు ప్రస్తావించలేదు? ఈ రాష్ట్రంలో కోటికి పైగా పాన్ కార్డులు ఉన్నాయి. వీళ్లకు కట్ చేస్తామంటే ఎలా? ఐటీ కట్టే వాళ్లకు కట్ట్ చేస్తామంటే ఎలా ? రైతు బంధు పథకాన్ని ఉరి వేయబోతున్నారని మా అనుమానం అని కేటీఆర్ అన్నారు.