Ashes series 2025: త్వరలోనే ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మరోసారి తనదైన ట్రేడ్‌మార్క్ జోస్యం చెప్పుకొచ్చారు. రాబోయే 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.