Poonch Attack: జమ్మూకాశ్మీర పూంచ్ జిల్లాలో గురువారం భీంజెర్ గలి నుంచి సాంగియోట్ కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు గ్రెనెడ్స్ తో దాడి చేశారు. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన ఐదుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. సైన్యంతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.