బీహార్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో చోటుచేసుకుంది. ఒకేసారి ఐదుగురు హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.