Ghaziabad: బాలికపై తల్లి స్నేహితుడు అత్యాచారం, చిత్రహింసలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ ఇద్దరి పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె మరొకరితో సహజీవనం చేస్తోంది. అయితే మహిళ లేని సమయంలో 10 ఏళ్ల కుమార్తెపై ఆ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. అంతేకాకుండా ఆ బాలిక సోదరుడి(13)పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విషయాన్ని పిల్లలు తల్లికి చెబితే.. కామాంధుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి.. ఆ కసాయి తల్లి పిల్లల్నే చిత్రహింసలకు గురిచేసింది. దీంతో ఆమె బాధల్ని తట్టుకోలేక పిల్లలిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఆ బాలిక తల్లిని, ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Memantha Siddham Bus Yatra: 13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్ ఇదే..
Also Read
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
జనవరి 20న ఇంట్లో లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఢిల్లీకి పారిపోయింది. వీధుల్లో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. అనంతరం వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరిగిందని తేలింది. అనంతరం ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Janata Bar Movie: హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?
బాలిక తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె తల్లి రాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. రాజు.. బాలిక, బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తల్లి లేని సమయంలో బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి తెగబడ్డాడు. దీంతో విషయాన్ని తల్లికి చెబితే.. ఆమె ప్రియుడు రాజుకే సపోర్ట్ చేసింది. విషయం బయటకు పొక్కకుండా బిడ్డల్ని చిత్రహింసలకు గురి చేసింది. దీంతో బాలుడు ఇంట్లో నుంచి ముందే పారిపోగా.. బాలిక మాత్రం జనవరి 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారన్న విషయాన్ని ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రియుడితో సంతోషంగా గడుపుతోంది. కనీసం పిల్లలు ఏమయ్యారన్న విషయాన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తన తల్లి పెద్దయ్యాక.. తనను వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తాదేమోనన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక తల్లి, ప్రియుడు రాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Noida: గ్రావిటీ మంత్ర రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం
తాజావార్తలు
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!