తెలుగు సినిమా రంగంలో వారసులకు కొదవలేదు. ప్రముఖ నటీనటుల కుమారులే కాదు నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల పిల్లలు సైతం హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే ఈసారి చివరి నిమిషంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈ సీజన్ పై టాలీవుడ్ వారసులు కన్నేశారు. మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు రానా నటిస్తున్న ‘1945’ చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతోంది.…
‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలన్నీ సందడి చేయడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’ జనవరి 14న, అశోక్ గల్లా ‘హీరో’ మూవీ జనవరి 15న, డిసెంబర్ 31న విడుదల కావాల్సిన రానా ‘1945’ చిత్రాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ రాబోతోంది. మరి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం…
సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోవడం కాదు గానీ… చిన్న చిత్రాల నిర్మాతలకు అది జాక్ పాట్ గా మారింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తమ చిత్రాలను విడుదల చేసుకోవడం కష్టం అని భావించిన చాలామంది చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన ‘డిజె టిల్లు’ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తామని…
దగ్గుబాటి రానా నటించిన పేట్రియాటిక్ మూవీ ‘1945’ ఈ నెల 31వ తేదీ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేశారు. నిజానికి 2016లోనే ‘1945’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీని సత్యశివ తెరకెక్కించారు. అనివార్య కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘1945’ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు వెలుగు చూడబోతోంది. Read Also : రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి! ప్రాణాలను పణంగా…